
మెదక్‌టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికే అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని ఓ గార్డెన్స్‌లో నియోజకవర్గానికి చెందిన 223 మంది లబ్ధిదారులకు రూ.63 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
రామాయంపేట పట్టణంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.