వరంగల్ ను స్పోర్ట్స్ హబ్ గా మార్చుతున్నాం: ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు

వరంగల్ ను స్పోర్ట్స్ హబ్ గా మార్చుతున్నాం: ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు
  • జేఎన్ఎస్ లో స్టేట్ లెవల్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు షురూ 

హనుమకొండ, వెలుగు : వరంగల్ సిటీని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు తెలిపారు. హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులు జరగనున్న 11వ స్టేట్ లెవల్ అండర్ 14, 16, 18, 20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు.  రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

ఓరుగల్లుకు సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేశారని, ఈ ఏడాదే అడ్మిషన్లు స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే స్పోర్ట్స్ స్కూల్ కు ప్రిన్సిపల్ తో పాటు 10 మంది స్టాఫ్ పోస్టులు సాంక్షన్ చేశారన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులు ఒలింపిక్ లో రాణించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. యువత డ్రగ్స్ కు అడిక్ట్ కాకుండా స్పోర్ట్స్ పై పట్టుసాధిస్తే జీవితాలు మారుతాయని పేర్కొన్నారు.  కార్యక్రమంలో డీవైఎస్ వో గుగులోతు అశోక్ కుమార్, ఒలింపిక్స్ అసోసియేషన్ నేతలు, వివిధ జిల్లాల నుంచి దాదాపు 1400 మంది క్రీడాకారులు తరలివచ్చారు.