వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి  : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి  : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం బల్దియా మేయర్ గుండు సుధారాణితో కలిసి 52వ డివిజన్ నైమ్‌‌‌‌నగర్‌‌‌‌లో రూ.110 లక్షలతో, 9వ డివిజన్ రాయపూర్‌‌‌‌లో రూ.50 లక్షలతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సానుకూల పరిణామమన్నారు. మే 6న కార్పొరేటర్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, వారి సహకారం, సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.