అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం : ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం : ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి తెలిపారు. గురువారం మహబూబ్​నగర్  రూరల్  మండలం మణికొండ గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్​ అందజేసి, ఇండ్లకు భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని తెలిపారు. గ్రామంలో పారిశుధ్యం, పెండింగ్  పనుల గురించి ఆరా తీశారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. లైబ్రరీ చైర్మన్  మల్లు నరసింహారెడ్డి, డీటీ శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీవో కరుణశ్రీ పాల్గొన్నారు.