V6 News

అభివృద్ధి చేశా.. అభ్యర్థులను ఆశీర్వదించండి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి

 అభివృద్ధి చేశా.. అభ్యర్థులను ఆశీర్వదించండి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి
  • ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి 

వర్ని, వెలుగు : బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, కాంగ్రెస్​ బలపర్చిన అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం మోస్రా మండల కేంద్రంలో  నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

 మోస్రా సర్పంచ్ గా పోటీ చేస్తున్న బిల్ల రాజశేఖర్​రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉందని  అభ్యర్థిని గెలిపిస్తే  మోస్రా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.  కార్యక్రమంలో అగ్రోస్ చైర్మన్​ కాసుల బాల్​రాజ్, వర్ని ఏఎంసీ వైస్​చైర్మన్ కోత్మిర్కర్ లక్ష్మణ్, నాయకులు హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.