అయ్యప్ప దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి

అయ్యప్ప దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి
  • ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి

బాన్సువాడ, వెలుగు : అయ్యప్ప దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామిజీ సమక్షంలో మంగళవారం బాన్సువాడ లోని ఎమ్మెల్యే స్వగృహంలో అయ్యప్ప స్వామి పడిపూజ  ఘనంగా జరిగింది.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వానకాలంలో బాన్సువాడ ప్రాంతంలో ఎలాంటి వరద ముప్పు కలుగకుండా ఉంటే పడిపూజ చేయిస్తానని మొక్కుకున్నానన్నారు. స్వామిజీ మాట్లాడుతూ అందరిలో పరమాత్మని చూడడమే భక్తి  అన్నారు.

 ప్రజాసేవలో బిజీగా ఉండి కూడా అయ్యప్ప పడిపూజలో పోచారం కుటుంబీకులు పాల్గొనడం అభినందనీయమన్నారు. హైదరాబాద్​నుంచి వచ్చిన స్వాములతో వివిధ రకాల అభిషేకాలతో పడిపూజ రంగ రంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం 18 మెట్ల పూజ చేసి హారతులు ఇచ్చి, స్వాములందరికీ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గురు వినయ్ కుమార్, ముదిరెడ్డి విఠల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పోచారం తనయుడు సురేందర్ రెడ్డి, పోచారం శంబు రెడ్డి, డీఎస్పీ విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.