లక్ష మెజార్టీతో గడ్డం వంశీని గెలిపిస్తాం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు

లక్ష మెజార్టీతో గడ్డం వంశీని గెలిపిస్తాం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు

మంచిర్యాల: దేశంలోనే కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్లో మంచిర్యాల జిల్లా మొదటి స్థానంలో ఉంది.. అందరం కలిసి పెద్దపల్లి నియోజకవర్గ ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిద్దామని పిలుపునిచ్చారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. వంశీకృష్ణను చూస్తుంటే..కాకా వెంకటస్వామి కనిపిస్తున్నాడు.. కాకా వారసుడిగా గడ్డం వంశీకృష్ణను లక్ష మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపుతా మన్నారు. 

గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కుడిచేతితో రైతుబంధు ఇచ్చి ఎడమ చేతితో క్వింటాలుకు 5నుంచి 10 కిలోల తరుగు తీసిందన్నారు. రైతులను దారి దోపిడి చేశారని విమర్శించారు. 10 సంవత్సరాల్లో చేయన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వంద  రోజుల్లో చేసి చూపించిందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో 200 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు ప్రేమ్ సాగర్ రావు.