ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జూలై 31కి వాయిదా

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జూలై 31కి వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ దర్యాప్తు లేకుండా స్టే ఇవ్వాలన్న  ష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వకేట్ దుష్యంత్ దవే నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది. జూలై 31 వరకు దర్యాప్తుపై స్టే కొనసాగించాలని కోర్టు నిర్ణయించింది. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దర్యాప్తుపై స్టే విధించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు దర్యాప్తు వివరాలను సీబీఐకి సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై31కి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే సీబీఐ విచారణపై రాష్ట్ర ప్రభుత్వం పలు సార్లు స్టే అడగగా.. సుప్రీం ఆ నిర్ణయాన్ని తిరస్కరించింది. తాజాగా కోర్టు ఇచ్చిన స్టేటస్ కోతో సీబీఐ విచారణ ప్రస్తుతానికి వాయిదా పడినట్టే తెలుస్తోంది.  అంతకుముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.