అమెజాన్ బ్యాడ్ మార్నింగ్ : అర్థరాత్రి టైంలో లేఆఫ్స్ మెయిల్స్ : ఇండియాలో ఎంత మందికి అంటే..!

అమెజాన్ బ్యాడ్ మార్నింగ్ : అర్థరాత్రి టైంలో లేఆఫ్స్ మెయిల్స్ : ఇండియాలో ఎంత మందికి అంటే..!

అమెరికా టెక్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ భారీగా ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జరుగుతున్న తొలగింపులు ఉద్యోగులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తూ అభివృద్ధి కోసం శ్రమిస్తు్న్నా తొలగింపుల్లో ఇళ్లకు పంపటంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా తనను లేఆఫ్ చేసిన విధానం గురించి ఒక ఉద్యోగి బ్లైండ్ ఫ్లాట్ ఫారంలో పంచుకున్నాడు. ఇప్పటికే తాను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కుదరక తన పాపతో సమయం గడపలేకపోతున్నానని అదే సమయంలో కంపెనీ తనను ఫైర్ చేసినట్లు చెప్పిందని ఆయన చెప్పారు. కంపెనీలో నాలుగేళ్లుగా కష్టపడి పనిచేస్తున్నానని.. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని తెల్లవారుజామున 5 గంటలకు ఇలాంటి పోస్ట్ ఒకటి పెడతానని కలలో కూడా అనుకోలేదన్నాడు. తాను పనిలో ప్రతిరోజూ అత్యుత్తమ పనితీరును కనబరిచినట్లు ఆ ఉద్యోగి తన పోస్టులో చెప్పాడు. 

వాస్తవానికి తానే కొన్నాళ్లుగా కంపెనీని విడిచిపెట్టాలని అనుకుంటున్నానని.. అదే సమయంలో ఊహించని మెరుపులా లేఆఫ్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. తనకు తెల్లవారుజాము 2 గంటల సమయంలో ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఒక మెయిల్ అధికారికంగా అందిందని.. కార్పొరేట్ ప్రపంచంలో భవిశా ఇలాగే ఉంటుందేమో అంటూ పోస్ట్ పెట్టాడు. దేవుడే కావాలని ఈ చిన్న బ్రేక్ ఇచ్చి ఉండొచ్చని అన్నాడు. దీని కంటే మంచి భవిష్యత్తు ముందుందనే ఆశతో ముందుకెళ్లబోతున్నట్లు తన పోస్టులో చెప్పాడు. 

ALSO READ : మారిన SBI క్రెడిట్ కార్డ్ రూల్స్.. 

భారతీయుల లేఆఫ్స్..
అమెరికాకు చెందిన అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా 14వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భారతీయ ఉద్యోగుల సంఖ్య 800 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మందికి పింక్ స్లిప్ అంటే లేఆఫ్ కి సంబంధించిన మెయిల్స్ పంపబడినట్లు వెల్లడైంది. రిటైల్ బిజినెస్ యూనిట్, రోబోటిక్స్ అండ్ డివైజెస్ వంటి విభాగాలతో పాటు మరికొందరు ప్రభావితం అవుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది ఉద్యోగులకు కంపెనీ యాక్సెస్ నిలిపివేసినట్లు కూడా కొందరు షేర్ చేస్తున్నారు. అమెజాన్ వీడియో డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా ప్రభావితం అవనున్నట్లు తేలింది. కంపెనీ మాత్రం అధికారికంగా తొలగింపులపై ప్రకటన చేయలేదు ఇప్పటి వరకు.