ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ - 2025 చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సెమీస్ లో టీమిండియా అమ్మాయిలు గెలిచిన తీరు.. ఫైనల్ మ్యాచ్ పై భారీ అంచనాలు పెంచేలా చేసింది. వరల్డ్ కప్ నాకౌట్ దశలో అటు మెన్స్, ఇటు విమెన్స్ టీమ్ లలో 339 టార్గెట్ ను చేజ్ చేయడం ఇదే తొలిసారి కావడంతో ఇప్పుడంతా ఆ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఫైనల్ లో అత్యంత బలమైన సౌతాఫ్రికాతో ఢీకొట్టనుండటంతో మ్యాచ్ పై అంచనాలు హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈవెంట్ లో ఫేమస్ సింగర్ సునిధి చౌహాన్ పర్ఫామ్ చేయనుంది. నవీ ముంబైలోని డా.డీ.వై పాటిల్ స్టేడియంలో మ్యాచ్ కు ముందు ఆట పాటలతో ఆకట్టుకోనుంది సునిధి. ఈవెంట్ జాతీయ గీతంతో ప్రారంభమవుతుంది. సౌతాఫ్రికా ఆర్టిస్ట్ టరైన్ బ్యాంక్.. వాళ్ల జాతీయగీతాన్ని ఆలపించనుంది. ప్రీ మ్యాచ్ సెలబ్రేషన్స్ ఆటలు, కల్చరల్ ఈవెంట్స్ తో గ్రాండ్ ఈవెంట్ గా నిలవనున్నాయి.
వరల్డ్ కప్ సెరిమనీలో పర్ఫామ్ చేయడం చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా సునిధి చెప్పింది. ఇండియా ఫైనల్ కావడంతో ఈ ఈవెంట్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుందని చెప్పింది.
మొత్తం 350 ఆర్టిస్టులతో ఈ పర్ఫామెన్స్ ఉంటుందని.. డ్రోన్స్ షో, లేజర్ షో ఉంటుంది. సంజయ్ శెట్టీ కొరియోగ్రఫీలో 60 మంది డ్యాన్సర్లతో పర్ఫామెన్స్ ఉంటుంది.
తెలుగులో సునిధి..
కేవలం 13 ఏళ్లకే సింగర్ గా కెరీర్ ప్రారంభించిన సునిధి.. ఎన్నో పాటలతో ప్రపంచ వ్యాప్తంగ అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులో కూడా చాలా పాటలు పాడింది. ఎటో వెళ్లిపోయింది మనసు (అటు ఇటు), బద్రినాథ్ (నాథ్ నాథ్ బద్రీనాథ్), ఓయ్ (సరదాగా చందమామను), చింతకాయల రవి (సరదాకే సరదా పుట్టే సమయంలో) మొదలైన సినిమాలలో పాటలతో పాపులారిటీ సంపాదించింది.
