కార్తీక మాసంలో పౌర్ణమి రోజు శివుడితో పాటుగా లక్ష్మీనారాయణుని కూడా ఆరాధిస్తారు. శివ-కేశవులను కార్తీక పౌర్ణమి నాడు పూజిస్తే, కష్టాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు, సిరిసంపదలతో సంతోషంగా ఉండొచ్చు అని నమ్ముతారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వచ్చింది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజున ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలి.. ఏ మంత్రం చదవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారు ఓం నమః శివాయ లేదా ఓం మహాకాలయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయడం.. శివనామస్మరణ.. పరమశివునికి రుద్రాభిషేకం.. రాగి దీపంలో ఆవునెయ్యితో దీపారాధన
వృషభ రాశి: ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం నమః అనే మంత్రాన్ని చదవడం.. మారేడు దళాలతో శివుడి ఆరాధన.. తులసీమాతకు పూజ.. లలిత సహస్రనామం చదవడం లేదా వినడం.. పిండి ప్రమిదలో ఆవునెయ్యితో దీపారాధన
మిథున రాశి: ఓం నమః శివాయ మంత్రంతో పాటు ఓం నమో నారాయణాయ మంత్రాలు పఠనం.. విష్ణు సహస్ర నామం ....భగవద్గీత పారాయణం లేదా భక్తి శ్రద్దలతో వినడం.. మట్టి ప్రమిదలో ఆవునెయ్యితో దీపారాధన.. గోమాతను పూజించడం.. పేదలకు దానం చేస్తే శుభ ఫలితాలు
కర్కాటక రాశి: ఓం నమః శివాయ మంత్రం, మహా మృత్యుంజయ మంత్రం (ఓం త్రయంబకం యజామహే.. సుగంధిం పుష్టివర్ధనం.. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ) చదవడం లేదా వినడం.. శివలింగానికి పాలతో అభిషేకం..
సింహ రాశి: ఓం సూర్యాయ నమః లేదా ఓం హ్రీం శ్రీం స్వాహా అనే లక్ష్మీదేవి మంత్రంతో పాటు ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం జపం చేయడం.. ఉదయాన్నే సూర్యనమస్కారాలు.. శివాలయంలో ఆవునెయ్యితో మట్టి ప్రమిదలో దీపారాధన.. బ్రాహ్మణులకు వస్త్రదానం... దక్షిణ.. తాంబూలం..గోధుమలు, బెల్లం దానం
కన్యా రాశి: ఓం నమః శివాయ మంత్రంతో పాటు ఓం నమో నారాయణయ లేదా శ్రీ లక్ష్మీ అష్టకం పఠనం.. శివుడిని.. విష్ణుమూర్తిని పూజించడం.. పేదలకు వస్త్రదానం.. పరమేశ్వరుడిని తేనెతో అభిషేకం
తులా రాశి: ఓం నమః శివాయ మంత్రంతో పాటు ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం నమః అనే లక్ష్మీ మంత్రాన్ని చదవడం... లక్ష్మీదేవిని అర్చించడం.. దీపదానం.. శివాలయంలో వెండి ప్రమిదలో దీపారాధన.. శివుడికి పంచామృతాలతో అభిషేకం
వృశ్చిక రాశి: ఓం నమః శివాయ మంత్రంతో పాటు మహా మృత్యుంజయ మంత్రం.. (ఓం త్రయంబకం యజామహే.. సుగంధిం పుష్టివర్ధనం.. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ) అనే మంత్రాన్ని చదవడం లేదా వినడం.. శివుడికి .. సుబ్రహ్మణ్యస్వామికి పూజ.. ఎర్రటి వస్త్రాలు, పప్పు ధాన్యాలు దానం
ధనుస్సు రాశి: ఓం నమః శివాయ మంత్రంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా దత్తాత్రేయ మంత్రం (ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః) పఠించడం శుభప్రదం...ఇంకా సత్యనారాయణ వ్రతం.. శివుడికి రుద్రాభిషేకం.. పసుపు రంగు వస్తువులు, శనగలు దానం
►ALSO READ | కార్తీకమాసం .. ఉసిరిచెట్టు కింద భోజనం ... శాస్త్రమా.. సైన్సా.. అసలు రహస్యం ఇదే..!
మకర రాశి:ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో ఓం శివదానీశ్వరాయ నమః లేదా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రం చదవడం.. శివుడిని.. శనీశ్వరుడిని ఆరాధించడం.. నువ్వులనూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన
కుంభ రాశి: ఓం నమః శివాయ అనే మంత్రంతో పాటు ఓం పాతాళేశ్వరాయ నమః అనే మరో శివ మంత్రం లేదా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం నమః అనే మంత్రం పఠించడం శుభప్రదం. పేదలకు అన్నదానం.. వస్త్రదారం.. శివుడిని భక్తిశ్రద్దలతో పూజించి.. లింగాష్టకం పఠనం
మీన రాశి: ఓం నమః శివాయ అనే మంత్రంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా బృహస్పతి మంత్రం (ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ్ గురువే నమః) పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శివుడిని.. విష్ణుమూర్తిని పూజించడం.. గంగాజలంతో స్నానం.. ఆవునెయ్యితో దీపారాధన.. పసుపు రంగు స్వీట్లు నైవేద్యం
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
