కేసీఆర్​ కుటుంబానికి ఉసురు తగుల్తది : ఎమ్మెల్యే రఘునందన్​రావు

కేసీఆర్​ కుటుంబానికి ఉసురు తగుల్తది : ఎమ్మెల్యే రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు:  రైలు యాక్సిడెంట్​ అయితే అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్​బహుదూర్​శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని, 30 లక్షల మంది నిరుద్యోగులు రాసిన టీఎస్​పీఎస్​సీ పరీక్షా పేపర్లు లీకయితే సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించకపోవడం ఏమిటని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు మండిపడ్డారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం దుబ్బాకలో టీఎస్​పీఎస్​సీ అక్రమాలపై సిట్టింగ్​జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్​ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల ఆవేదన, తల్లిదండ్రుల ఉసురు కేసీఆర్​ కుటుంబానికి తగుల్తదన్నారు. మంత్రి కేటీఆర్​అహంకారంతో మీడియాను బెదిరిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్​తన బిడ్డను లిక్కర్​ క్వీన్​గా తయారు చేశారని, చెల్లె ఎక్కడ జైలుకు  పోతుందేమోనని మంత్రి కేటీఆర్​ అడ్డదారులను వెతుక్కోవడానికి ఢిల్లీకి పోయాడన్నారు. గ్రూప్​ వన్​పేపర్ ​లీకైందన్న ఆవేదనతో 

సిరిసిల్లలో నవీన్​ఆత్మహత్య చేసుకుంటే బాధిత కుటుంబాన్ని పరామర్శించే టైం ఆయనకు లేకుండా పోయిందన్నారు. కేటీఆర్​, కవితకు అనుకూలంగా ఉన్న అనుచరుల పిల్లలకే టీఎస్​పీఎస్​సీ నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు వచ్చాయని, ఒక్కొక్క ఊరిలో పదుల సంఖ్యలో గ్రూప్స్​లో అర్హత ఎలా సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఓయూ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్​ చేశారు. టీఎస్​పీఎస్​సీ అక్రమాలపై సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.  బాధ్యులైన మంత్రులను బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు.