ముందస్తుకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ లీకులు ఇస్తున్నారు : రఘునందన్ రావు

ముందస్తుకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ లీకులు ఇస్తున్నారు : రఘునందన్ రావు

ముందస్తు ఎన్నికలకు వెళ్తారని సీఎం కేసీఆర్ లీకులు ఇస్తున్నారని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. జమిలి ఎన్నికలు జరిగితే సీఎం కేసీఆర్‭కు ఇబ్బంది ఏర్పడుతుందని.. అవి జరగకుండా ఆలోచిస్తున్నారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలు 2018 డిసెంబర్ 7 జరిగాయని, అవి జరిగి నాలుగేండ్లు పూర్తైందని గుర్తు చేశారు. బీజేపీ బలం డబ్బులు కాదని, కార్యకర్తలేనని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టెక్నికల్‭గా గెలిచింది టీఆర్ఎస్ అయినా.. ఓట్ల శాతంలో బీజేపీనే గెలిచిందన్నారు. కార్యకర్తలకు మందు, బిర్యానీ, డబ్బులు పంచితేనే బీఆర్ఎస్ మీటింగులకు రారని రఘునందన్ రావు విమర్శించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశంలో రఘునందర్ రావు ఈ కామెంట్స్ చేశారు. 

ప్రతి గ్రామంలో ధరణి వల్ల దళితులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 7న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రతి బూత్ కమిటీ బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ ను గద్దె దించాలని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నిక నుండి పంచాయతీ ఎన్నిక వరకు గెలవాలంటే బూత్ కమిటీ ద్వారానే సాధ్యమవుతుందని రఘునందన్ రావు స్పష్టం చేశారు.