కల్వకుంట్ల కవిత అడ్డదారిలో ఎమ్మెల్సీ అయింది: రఘునందన్ రావు

కల్వకుంట్ల  కవిత అడ్డదారిలో  ఎమ్మెల్సీ అయింది: రఘునందన్ రావు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటు విమర్శలు చేశారు. అడ్డదారిలో  ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవిత ఉద్యమంలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఉద్యయాన్ని ఉదృతం చేసిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ ఎమ్మెల్యే లేదా ఎంపీ, ఎమ్మెల్సీ ఎందుకు కాలేదని ప్రశ్నించారు. మెదక్ పట్టణంలో తపస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. 

2014లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన సమయంలో కేసీఆర్ కేబినెట్లో ఒక్క మహిళా లేదని ఎమ్మె్ల్యే రఘునందన్ రావు మండిపడ్డారు.  ఆ సమయంలో కవిత తన పదవికి రాజీనామా చేసి ఉంటే ఆమెకు తెలంగాణ మహిళలు బ్రహ్మరథం పట్టేవారన్నారు. మహిళల సమస్యల కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పారు.  మహిళలకు 33శాతం రిజ్వేషన్ బిల్లును త్వరలో పార్లమెంట్ లో ప్రవేశ పెడతామని రఘునందన్ రావు వెల్లడించారు.