డీసీపీ అబద్దం చెప్తుండనే ఆధారాలు బయటపెట్టిన 

డీసీపీ అబద్దం చెప్తుండనే ఆధారాలు బయటపెట్టిన 

బాలికపై అఘాయిత్యం కేసులో ఫొటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై కేసు నమోదుకావడంపై ఎమ్మెల్యే  రఘునందన్ స్పందించారు. పోలీసు కేసులకు భయపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. తాను చట్టాలను గౌరవించే వ్యక్తినని, అందుకే కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఎలాంటి కేసునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రఘునందన్ ప్రకటించారు. ఈ కేసులో పోలీసులకే శిక్ష పడుతుందని అభిప్రాయపడ్డారు. కేసుకు సంబంధించి పోలీసులు తనకెలాంటి సమాచారం ఇవ్వలేదన్న రఘునందన్.. పోలీసుల రియాక్షన్ ను బట్టి తన యాక్షన్ ఉంటుందని చెప్పారు.

బాలిక ఘటనలో ఎమ్మెల్యే కుమారుడికి సంబంధంలేదని అబద్దాలు చెప్పడంతోనే ఆధారారాలు బయటపెట్టాల్సి వచ్చిందని రఘునందన్ స్పష్టం చేశారు. పోలీసులు చేయాల్సిన పని తానే చేశానని అన్నారు. ఎలాంటి దర్యాప్తు లేకుండానే ఎమ్మెల్యే కుమారుడికి సంబంధం లేదని డీసీపీ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేవలం 3గంటల్లోనే ఇన్వెస్టిగేషన్ ఎలా పూర్తి చేశారని నిలదీశారు. తాను వీడియోలు బయటపెట్టిన తర్వాత ఎమ్మెల్యే కుమారుడికి కూడా ఘటనతో సంబంధముందని ఎందుకు చెప్పారని అన్నారు. బాలికపై అఘాయిత్యం చేసిన వారిని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని రఘునందన్ మండిపడ్డారు.