
దాదాపు ఏడాది తరువాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. సస్పెషన్ ఎత్తేసి, సీటు కేటాయించడంతో రాజాసింగ్ భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు.
రాముడికి 14 ఏళ్ల వనవాసం ఉంటే.. తనకు 14 నెలలు వనవాసం వేశారని ఈ సందర్భంగా రాజాసింగ్ నవ్వుతూ చెప్పారు. చాలా రోజుల తరువాత పార్టీ కార్యలయానికి రావడం సంతోషంగా ఉందన్న రాజాసింగ్... వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : తిరుమల శ్రీవారి సేవలో ఏపీ గవర్నర్ దంపతులు
కాగా ఓ మతాన్ని కించపరిచే విధంగా రాజాసింగ్ కామెంట్స్ చేశారన్న ఆరోపణలతో గతేడాది రాజాసింగ్ ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ బీజేపీ ఇవాళ నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా ఇవాళ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో రాజాసింగ్‌కు గోషామహల్ నుంచి మరోసారి అవకాశం ఇచ్చి్ంది. ఈ క్రమంలో భారీ ర్యాలీతో రాజాసింగ్ పార్టీ కార్యాలయానికి వచ్చారు.