స్పృహ తప్పిన ఎమ్మెల్యే రేఖానాయక్

స్పృహ తప్పిన ఎమ్మెల్యే రేఖానాయక్

ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ వద్ద ఖానాపూర్​ఎమ్మెల్యే రేఖానాయక్​ మంగళవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  బీపీ, షుగర్​లెవెల్​ఒక్కసారిగా పెరగడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు.  నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పర్యటనలో భాగంగా  సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్ తో కలిసి ఎమ్మెల్యే రేఖానాయక్ హెలికాప్టర్ లో సదర్మట్, చనాఖా కోర్ట, గడ్డెన్న ప్రాజెక్టు సందర్శించి తిరిగి నిర్మల్​కు వచ్చారు.

అక్కడ భోజనం కోసం వెళ్తుండగా స్థానిక ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ వద్ద ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. అక్కడున్న అధికారులు వెంటనే స్పందించి డాక్టర్లను పిలిపించి వైద్యసేవలు అందించారు.  బీపీ, షుగర్​లెవల్​ పెరగడంతో ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు.