- ఎమ్మెల్యే రోహిత్ రావు
మెదక్ టౌన్, వెలుగు: మల్లికార్జునస్వామి ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావు చెప్పారు. సోమవారం మెదక్ పట్టణంలోని నవాపేట వీధిలో ఉన్న మల్లన్నస్వామి కళ్యాణోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నవాపేట గొల్లకురుమ సంఘ సభ్యులు, కాలనీవాసులు ఈ జాతర పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎల్లప్ప, స్థానిక నాయకులు లక్ష్మీనారాయణ, పవన్, సంతోష్, శివ, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీ, ముత్యంగౌడ్, నవాపేట గొల్ల కురుమ సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
