గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే రోహిత్ రావు

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే రోహిత్ రావు
  •     ఎమ్మెల్యే రోహిత్ రావు

పాపన్నపేట, వెలుగు : ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వనియోగం చేసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. సోమవారం మండలంలోని పొడ్చన్​పల్లిలో గ్రంథాలయాన్ని  ప్రారంభించి మాట్లాడారు.  విద్యార్థులు, యువకులు పుస్తకాలు,పేపర్​ చదివే అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏసు, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి , వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు,యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ..

మెదక్ :  హవేళిఘనపూర్, మెదక్​ మండలాలకు లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో ఎమ్మెల్యే రోహిత్​రావు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ​​చెక్కులను అందజేశారు.  పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు.  పేదల సంక్షేమమే ధ్యేయంగా రేవంత్​ రెడ్డి సర్కార్​ పని చేస్తోందన్నారు.  

రామాయంపేటలో  ఘనంగా నరసింహ హోమం 

రామాయంపేట: రామాయంపేట పట్టణ శివారులోని నరసింహ దేవాలయం వద్ద సోమవారం నవ కుండాత్మక సుదర్శన హోమం కాంగ్రెస్ లీడర్​గజవాడ నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఉదయం స్వామి వారికి అభిషేకం, అనంతరం హోమం నిర్వహించగా, దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.