తిరుమల శ్రీవారిని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో వైకుంఠ ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారడాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. ఏపీలో కూడా టిఆర్ఎస్ పార్టీపై తీవ్రమైన చర్చ జరుగుతుందని అన్నారు. రాజకీయాలలో మార్పు రావాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని రోహిత్ రెడ్డి చెప్పారు.
ఏపీలో చాలామంది సెట్టింగ్ ఎక్స్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి టచ్‌లో ఉన్నారని త్వరలో అందరూ టిఆర్ఎస్లో చేరతారని పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సరైన నాయకత్వం లేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకబడి ఉందని చెప్పారు. దొంగ కరెంటు తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి లేదని తమకు కేటాయించిన విద్యుత్‌ను తీసుకుంటున్నామని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.