
సినిమా టిక్కెట్లు ఆన్లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే జగన్ అమలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు కోడేలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకూండా మానసిక క్షోభకు గురి చేసినప్పుడు అయ్యన్న ఏం అయ్యారని ఆమె ప్రశ్నించారు. అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు భాధాకరమని, ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.. ప్రతిపక్షాలు.. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్ ని చూసి నేర్చుకోవాలన్నారు.