నేనే గెలుస్తా.. అప్పుడు నీ సంగతి చూస్తా.. గొంతు తగ్గించుకొని మాట్లాడు..: ఎమ్మెల్యే సైదిరెడ్డి

నేనే గెలుస్తా.. అప్పుడు నీ సంగతి చూస్తా.. గొంతు తగ్గించుకొని మాట్లాడు..: ఎమ్మెల్యే సైదిరెడ్డి

నేనే గెలుస్తా.. అప్పుడు నీ సంగతి చూస్తా.. నీ గొంతు తగ్గించుకొని చేసుకొని మాట్లాడు.. లేకపోతే నీ సంగతి చెప్తానంటూ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఓ సీఐని బెదిరించారు. దీంతో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వీవీ మందిర్ స్కూల్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. 

ఎమ్మెల్యే సైదిరెడ్డి తన అనుచరులతో కలసి బీఆర్ఎస్ పార్టీ కండువాలతో పోలింగ్ బూత్ కు ఓటు వేయడానికి వచ్చారు. దీంతో కండువా తీయమని డ్యూటీలో ఉన్న సీఐ చెప్పారు. 

దీంతో నేనే గెలుస్తా.. అప్పుడు నీ సంగతి చూస్తా.. నీ గొంతు తక్కవ చేసుకొని మాట్లాడు.. లేకపోతే నీ సంగతి చూస్తానంటూ ఎమ్మెల్యే సైదిరెడ్డి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, సీఐకి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.