నాపై దుష్ప్రచారం చేస్తే.. ఖబర్దార్: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

నాపై దుష్ప్రచారం చేస్తే.. ఖబర్దార్: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

సీనియర్ లీడర్లు తనను వక్రీకరించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రశ్నించే గొంతు నుంచే నిజాలు కూడా రావాలని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ అభ్యర్తుల ప్రకటనలో హై కమాండ్ కు కోట్ల రూపాయలు ఇచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. జీవన్ రెడ్డి పది సార్లు పోటి చేసిండు.. ఎమ్మెల్యేగా ఓడిపోతే.. ఎమ్మెల్సీగా పోటీ చేసిండని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి కోట్లు పెట్టి ప్రకటనలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. 

ఇందిరా గాంధీని తిట్టిన జీవన్ రెడ్డి.. ఆమె చనిపోయిన తర్వాత అదే పార్టీలో చేరి.. రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు. ప్రస్తుతం ఆయనే నీతి సూక్తులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ బిక్ష పెడితే.. నాదెండ్ల భాస్కరరావు దగ్గర జీవన్ రెడ్డి చేరింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. డబ్బులు లేకుండానే ఓట్లు అడిగారా..? అని నిలదీశారు. 

కాంగ్రెస్ హాయాంలో ఉన్నప్పుడు మూడు గంటల ఉచిత కరెంట్ ఇచ్చి.. ప్రజలన్ని ముప్పు తిప్పలు పెట్టించారని సంజయ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ మిత్తికే పోయిందని.. అబద్ధపు ప్రచారం చేస్తున్నారని సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రల్లో రుణ మాఫీ, రైతుబంధు, రైతు భీమా ఉందా..? అని నిలదీశారు. నర్సింగాపూర్ లో మాస్టర్ ప్లాన్ ను రద్దు పరిచినా కూడా.. అబద్దాలు చెప్పి ప్రజలను తప్పు దోవా పట్టిస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు.