సీఎం సహకారంతోనే జగిత్యాల అభివృద్ధి : ఎమ్మెల్యే సంజయ్కుమార్

సీఎం సహకారంతోనే జగిత్యాల అభివృద్ధి : ఎమ్మెల్యే సంజయ్కుమార్

రాయికల్, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి సహకారంతోనే జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్​సంజయ్​కుమార్​తెలిపారు. బుధవారం రాయికల్​మండలం శ్రీరాంనగర్, భూపతిపూర్, ఒడ్డెలింగాపూర్, కట్కాపూర్, రాయికల్​గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఎస్సీ సబ్​ప్లాన్​ కింద మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంతో కలిసి పని చేయడం వల్లే జగిత్యాల, రాయికల్​మున్సిపాల్టీలకు ఎక్కువ నిధులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. 

నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కోటి రూపాయలు తీసుకువచ్చి పనులు చేపట్టుతున్నట్లు వివరించారు. రాయికల్​పట్టణంలో ఇరుకు రోడ్లు ఉన్నాయని, డ్రైనేజీలపై స్లాబ్​వేసి వాటిని వెడల్పు చేస్తామని వివరించారు. అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. అనంతరం రాయికల్​పట్టణంలోని గుడేటి రెడ్డి సంఘంలో 27 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌, 37 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 

తాగునీటి సమస్య తీర్చాలని వినతి

  భూపతిపూర్​ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు తమకు తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయని, మినీ వాటర్​ ట్యాంకు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు.