- ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఆడపిల్లల చదువు దేశానికి ప్రగతి అని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శనివారం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని సిర్గాపూర్ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని, విద్యను ప్రతి ఒక విద్యార్థి ఆయుధంగా మార్చుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పారు.
కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, సర్పంచ్ శ్రీనివాస్ రావు పాటిల్, యాదగిరి, ఎంఈఓ శ్రీనివాస్, స్కూల్ స్టాప్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
