అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తా : సంజీవరెడ్డి

అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తా : సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజీవరెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను విడతల వారీగా అమలు చేస్తామన్నారు. ఇందులో రెండు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాలు తెలంగాణ వెనుకబడిందని, మిగులు బడ్జెట్​లో ఉన్న రాష్ట్రాన్ని  దివాలా తీసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం విద్య, వైద్యానికే ఉంటుందన్నారు.  కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రెస్ మీట్ లో శేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రమేశ్ చౌహన్, బోజి రెడ్డి, దారం శంకర్, హనుమాన్లు పాల్గొన్నారు. 

కంగ్టి: ప్రజా సంక్షేమం కోసం 24 గంటలు పని చేస్తానని ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.