బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే

బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే

నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ పట్టణంలోని గవర్నమెంట్​ప్రైమరీ స్కూల్​లో బడిబాట కార్యక్రమాన్ని గురువారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నమెంట్​స్కూళ్లలో ఉండే సౌకర్యాల గురించి పేరెంట్స్ కి వివరించారు. అనంతరం పిల్లలతో అక్షరాలు దిద్దించారు. కార్యక్రమంలో టీచర్లు, తల్లిదండ్రులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.