
- బ్యానర్ పై ఫొటో లేకపోవడంతో ఈవో పై ఆగ్రహం
శివ్వంపేట, వెలుగు : శివ్వంపేట మండలం సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహ స్వామి జాతరను ఆదివారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం మొదలయ్యే ఈ జాతర ఎనమిది వారాల పాటు కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు, హైదరాబాద్ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇదిలా ఉండగా జాతర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్ పై తన ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రోటోకాల్ పాటించరా అని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఈవో శశిధర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట జడ్పీటీసీ మహేశ్ గుప్తా, ఆలయ ప్రధాన పూజారి ధనుంజయ శర్మ, సర్పంచ్ సుధాకర్ రెడ్డి, లావణ్య, అశోక్ రెడ్డి, యాద గౌడ్, మహేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, శ్రీశైలం, భిక్షపతి రెడ్డి ఉన్నారు.