
- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళలకు ఫ్రీ బస్అంటూనే పురుషులకు మాత్రం బస్‌చార్జీలను పెంచేశారని బీఆర్ఎస్ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనంతగా రూ.10 పెంచారని ఆరోపించారు. బస్‌చార్జీల పెంపు పేదలకు భారంగా మారిందన్నారు. మంగళవారం ఆయన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. "ఆర్టీసీ బస్సు చార్జీల పెంపునకు నిరసనగా గురువారం సిటీలో ఆందోళనలు చేస్తాం.
చలో బస్‌భవన్ కార్యక్రమం నిర్వహిస్తాం. ఇందులో భాగంగా.. కేటీఆర్, హరీశ్ రావు సహా సిటీ ఎమ్మెల్యేలంతా బస్సుల్లో ప్రయాణం చేసి బస్‌భవన్‌కు చేరుకుంటారు" అని తలసాని వివరించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. రెగ్యులర్ఆర్టీసీ ఉద్యోగులను తీసేసి ఔట్ సోర్సింగ్ఉద్యోగులను నియమిస్తున్నారని మండిపడ్డారు.