సమగ్ర కుటుంబ సర్వే పక్కాగా  చేపట్టాలి : కలెక్టర్ జితేశ్​ వి

 సమగ్ర కుటుంబ సర్వే పక్కాగా  చేపట్టాలి : కలెక్టర్ జితేశ్​ వి

పాల్వంచ, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో సిబ్బంది కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​వి పాటిల్ ఆదేశించారు. శుక్రవారం పైలెర్ట్​ ప్రాజెక్టు కింద మండలంలోని పునుకుల గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ నెల 6 నుంచి మొదలయ్యే ఈ సర్వేలో సిబ్బంది ఎటువంటి తప్పుల్లేకుండా పూర్తి చేయాలని చెప్పారు. 

పిల్లలకు ప్రభుత్వం ఆసరా! 

కోవిడ్ బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏండ్లలోపు పిల్లలతో మండలంలోని కిన్నెర సాని ప్రాజెక్టు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన ముఖాముఖికి కలెక్టర్​ జితేశ్​ హాజరయ్యారు. వారికి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. విద్యార్థులకు స్వీట్లు, ఇతర సామగ్రిని అందజేశారు. వారితో కలిసి భోజనం, బోటు షికారు చేశారు.

ఎమ్మెల్యే  పరిశీలన

భద్రాచలం : దుమ్ముగూడెం మండలం సీతారాంపురంలో శుక్రవారం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. సర్వే టీమ్​లు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వారికి సహకరించాలన్నారు.