
- రూ.1,323 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం
వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల రంగాన్ని పటిష్టపరిచేందుకు రూ. 1,323 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, చెక్‌డ్యాంల రిపేర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు.
కేఎల్ఐ–డి5, డి–8 కాలువల విస్తరణ, డిస్ట్రిబ్యూటరీ సిస్టం, బుద్ధారం కుడి, ఎడమ కాలువల పటిష్టత, గణపురం బ్రాంచ్ కెనాల్, కర్నే తండా, కాశీంనగర్ లిఫ్ట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలన్నారు. నీటిపారుదల శాఖ సీఈ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, డీసీఈ వెంకట్ రెడ్డి, ఈఈలు కేశవరావు, జగన్మోహన్ రెడ్డి, డీఈలు నరేందర్ రెడ్డి, అబ్దుల్ గఫార్, వెంకటరమణదేవి, రాజ్ కుమార్, కిరణ్ కుమార్, ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.