హరీశ్ రావు  ప్రజలకు క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

హరీశ్ రావు  ప్రజలకు క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

వనపర్తి, వెలుగు : గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి గతంలో జీఓలు ఇచ్చి, నేడు బాధితుల పక్షాన దీక్షలకు వస్తున్న మాజీ మంత్రి హరీశ్​రావు వనపర్తి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదుల రిజర్వాయర్ వల్ల వనపర్తికి చుక్క నీరు రాదని గుర్తించి 2016లో గొల్లపల్లి రిజర్వాయర్ కోసం జీఓలు తెచ్చింది గత ప్రభుత్వమేనని గుర్తుచేశారు. అప్పుడు మంజూరు చేసిన ప్రాజెక్టులనే ఇప్పుడు ప్రభుత్వం పూర్తి చేస్తుంటే, కమీషన్ల కోసం అలవాటు పడ్డ బీఆర్ఎస్ నాయకులు దుర్బుద్ధితో రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.