కాంగ్రెస్ సర్కారుతో పేదల సమస్యలకు పరిష్కారం :ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

కాంగ్రెస్ సర్కారుతో పేదల సమస్యలకు పరిష్కారం :ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: ప్రజాప్రభుత్వం పేదల సమస్యలు పరిష్కరిస్తుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.   గురువారం నియోజకవర్గంలోని గోపాల్​పేట, ఏదుల, రేవల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు గోపాలపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేషన్ కార్డులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మూడు మండలాలకు కలిపి 3,500 రేషన్​ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. 

సాంకేతిక సమస్యతో ఉచిత కరెంట్, రూ.500 సిలిండర్ పథకం కింద కొంత మందికి లబ్ధి చేకూరడం లేదన్నారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లాలో 37,962 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు చెప్పారు. కలెక్టర్  ఆదర్శ సురభి, అడిషనల్​ కలెక్టర్​  వెంకటేశ్వర్లు, డీఎస్ వో కాశీ విశ్వనాథ్, తహసీల్దార్లు పాండు, లక్ష్మి, మల్లికార్జున్, పీఏసీఎస్​ చైర్మన్  రఘు, మాజీ ఎంపీపీ సత్యశీలా రెడ్డి పాల్గొన్నారు.

ఉప్పునుంతల: కాంగ్రెస్  హయాంలోనే పేదలకు రేషన్ కార్డులు అందుతున్నాయని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. గురువారం మండలంలోని ఓ ఫంక్షన్ హాల్ లో తహసీల్దార్  ప్రమీలతో కలిసి లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. పదేండ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు కాంగ్రెస్  ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రేషన్​కార్డులు అందిస్తోందన్నారు. 1,612 కొత్త కార్డులు అందజేసినట్లు తెలిపారు. తెలంగాణ టీషాట్  సీఈవో బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి, కట్ట అనంతరెడ్డి, మామిళ్ళపల్లి ఆలయ చైర్మన్ నరసింహారావు, తిప్పర్తి అరుణ నరసింహారెడ్డి పాల్గొన్నారు.

ఆమనగల్లు: కడ్తాల్ లో గురువారం యూత్  కాంగ్రెస్  జిల్లా ప్రధాన కార్యదర్శి క్యామ రాజేశ్​ పంపిణీ చేశారు. పేదలకు రేషన్​ కార్డు భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇమ్రాన్ బాబా, భాను కిరణ్, శ్రీకాంత్, రమేశ్, రామకృష్ణ, సందీప్, శివ, మహేశ్, నరసింహ, శ్రీను పాల్గొన్నారు.