సీఎం నల్లమల్ల పర్యటన విజయవంతం చేయాలి : కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే వంశీకృష్ణ 

సీఎం నల్లమల్ల పర్యటన విజయవంతం చేయాలి : కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే వంశీకృష్ణ 

అమ్రాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపునిచ్చారు. అమ్రాబాద్ మండలంలోని మాచారంలో  ఈ నెల 18న సీఎం ప్రారంభించనున్న ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి సంబంధించిన పనులపై అడిషనల్​కలెక్టర్ దేవ సహాయం, డీఎఫ్​వో రోహిత్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.  గ్రామంలో గిరిజన, చెంచు ప్రజలు సాగు చేసుకుంటున్న ఆర్ ఓఎఫ్ ఆర్ పట్టా భూముల్లో(50 ఎకరాలు) బోరు బావులు తవ్వించినట్లు తెలిపారు.

అన్నింటిలోనూ పుష్కలంగా నీళ్లు పడ్డాయన్నారు.  వాటిని పరిశీలించి, సౌర విద్యుత్ అందించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. డీఆర్డీవో చిన్న ఓబులేసు, డీటీడీవో  ఫిరంగి, భూగర్భ జల శాఖ ఏడీ దివ్య జ్యోతి, డీపీవో రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.