ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులకు నష్టం : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి

ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులకు నష్టం : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి

బాల్కొండ, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వ అసమర్థత వల్లే మక్క రైతులు నష్టపోతున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం బడా భీంగల్‌‌‌‌ నుంచి అక్లూర్‌‌‌‌ వెళ్లే రోడ్డుపై మక్కలు ఆరబెట్టిన రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేట్‌‌‌‌ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతున్నారని చెప్పారు.

 ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అనంతరం బడా భీంగల్‌‌‌‌లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆఫీస్​ను ప్రారంభించి, వేల్పూర్‌‌‌‌లో పెద్దమ్మతల్లి ఆలయంలో శివోహం దుర్గా మండలి ఏర్పాటు చేసిన నవదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.