అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

 అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

మందమర్రి మార్కెట్ లో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి.. పంచశీల జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్ పాల్గొన్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పెద్దపల్లి,సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు.