కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కేసీఆర్.. లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు.. మేడిగడ్డను సందర్శించారు. కుంగిపోయిన మేడిగడ్డ పిల్లర్లను ఎమ్మెల్యేలందరూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్ల కోసం లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కేసీఆర్.. కంట్రాక్టర్లకు దోచిపెట్టారని విమర్శించారు. ఇప్పుడు మేడిగడ్డ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని.. దీనికి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.

విజిలెన్స్ రిపోర్ట్ చూశాక కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అనిపిస్తుందన్నారు వివేక్. కాళేశ్వరంలో జరిగిన అవినీతి విషయంలో మా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా వున్నారని చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని.. బాధ్యులను చట్టపరంగా శిక్షిస్తామన్నారాయన. మేడిగడ్డ సందర్శనకు ఆహ్వానించినా.. బీజేపీ ఎమ్మెల్యేలు రాకపోవడంతో.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని రుజువైందని వివేక్ వెంకటస్వామి అన్నారు.

Also Read:సత్య హరిశ్చంద్రుడి తమ్ముడివైతే .. సభకు ఎందుకు రావు