కుత్బుల్లాపూర్ లో మోసపూరిత హామీలు చెప్పి గెలిచినవ్ : కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ లో మోసపూరిత హామీలు చెప్పి గెలిచినవ్ : కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ పై బీజేపీ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ, ఈడీ దాడులు జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ కు సంబంధం ఏంటని కూన శ్రీశైలం గౌడ్ ప్రశ్నించారు. తాజాగా వివేక్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. బీజేపీ నాయకులపై విమర్శలు చేయడాన్ని కూన శ్రీశైలం గౌడ్ తప్పు బట్టారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి ఎమ్మెల్యే వివేక్ కు లేదన్నారు. 

"టీడీపీలో గెలిచి అమ్ముడు పోయినోడివి నువ్వు.. మా నాయకులపై మాట్లాడుతావా" అని కూన శ్రీశైలం గౌడ్ ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మోసపూరిత హామీలు చెప్పి గెలిచావని ఆరోపించారు. ఒక్క హామీనైనా నెరవేర్చావా? అని నిలదీశారు.