
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: మండలంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మన్యంకొండ దేవస్థానం సమీపంలో కొలువైన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఆలయాన్ని సందర్శించారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరిపై స్వామి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.
ఆలయ అభివృద్ధికి అన్నివిధాలుగా సహకరిస్తారనని తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, హాస్పిటల్ డెవలప్ మెంట్ కమిటీ సభ్యుడు బెజ్జుగం రాఘవేంధర్ ఉన్నారు