
పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్ టాస్క్ సెంటర్ ను హైదరాబాద్ లోని స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని మున్సిపల్ కాంప్లెక్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహబూబ్ నగర్ లో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. టాస్క్ సెంటర్ లో అన్నిరకాల కోర్సులకు అడ్వాన్స్ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇంటర్ నుంచి పీజీ పూర్తి చేసిన వారు శిక్షణ పొందవచ్చని చెప్పారు. మెట్టుగడ్డ ప్రాంతంలోని వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు కేటాయించిన స్థలంలో టాస్క్ సెంటర్ శాశ్వత భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పాలమూరు యూనివర్సిటీ వీసీ జీఎన్ శ్రీనివాస్, ముడా, లైబ్రరీ, ఏఎంసీ చైర్మన్లు లక్ష్మణ్ యాదవ్, మల్లు నర్సింహారెడ్డి, బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టాస్క్ సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్, డీఐఈవో కౌసర్ జహాన్ పాల్గొన్నారు.