క్రికెట్​లో చరిత్ర సృష్టించాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

క్రికెట్​లో చరిత్ర సృష్టించాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్​నగర్​ టౌన్, వెలుగు : క్రికెట్ లో మహబూబ్ నగర్  చరిత్ర సృష్టించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం  జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్  క్రికెట్  అసోసియేషన్  ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వేసవిలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడం అభినందనీయమని, క్రికెట్ లో రాణించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాకు హైదరాబాద్​ దగ్గరలో ఉందని, అవసరమైతే హెచ్ సీఏకు చెందిన నిపుణులైన కోచ్ లతో శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇప్పటికే హెచ్​సీఏ అధ్యక్షుడిని సంప్రదించినట్లు తెలిపారు. హైదరాబాద్ స్థాయిలో క్రికెట్ ను డెవలప్​ చేసుకుంటే ఇక్కడి క్రీడాకారులకు అవకాశం దక్కుతుందని చెప్పారు. అనంతరం శిక్షణ పొందిన స్టూడెంట్లకు సర్టిఫికెట్లు అందజేశారు. మున్సిపల్  చైర్మన్  ఆనంద్ గౌడ్, చీఫ్  ప్యాట్రన్  మనోహర్ రెడ్డి, రాజశేఖర్, సురేష్, కృష్ణమూర్తి, కౌన్సిలర్లు పాపారాయుడు, జాజిమొగ్గు నర్సింలు, మోతీలాల్, సత్తూర్  చంద్రకుమార్ గౌడ్, రాజేందర్ రెడ్డి, గట్టు వెంకట్ రెడ్డి, కోచ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ, మన్నాన్, ఆబిద్, సాయికుమార్  పాల్గొన్నారు. 

ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి

హాకీ క్రీడాకారిణి జ్యోతిరెడ్డి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రం నుంచి తొలిసారి భారత హాకీ జట్టుకు ఎంపికైన జ్యోతి రెడ్డిని ఆదివారం హైదరాబాద్  ఎల్బీ స్టేడియంలో కలిసి బొకేను అందజేసి అభినందించారు. హాకీలో రాణించి రాష్ట్ర ఖ్యాతిని చాటిచెప్పాలని సూచించారు. చాముండేశ్వర్​నాథ్, హెచ్ సీఏ అధ్యక్షుడు ఎ. జగన్మోహన్ రావు, రఘునందన్ రావు, సినీ దర్శకుడు వంశీ పాల్గొన్నారు