పాలమూరును ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరును ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: వలసల జిల్లాగా పేరున్న పాలమూరు జిల్లాను ఎడ్యుకేషన్​ హబ్​గా మారుస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు. మహబూబ్​నగర్​ మండలం ధర్మపూర్​లోని ఆల్  మదీనా ఎడ్యుకేషన్  సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన జీకే ఇంజనీరింగ్  కాలేజీని ఆయన సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందన్నారు. మహబూబ్​నగర్​ను ఎడ్యుకేషన్  హబ్​గా అభివృద్ధి చేయడానికి అందరి సహకారం అవసరమని, ఇందుకు ప్రభుత్వ, ప్రైవేట్​ సంస్థలు సహకరించాలని కోరారు.

 గ్రామీణ  విద్యార్థులకు స్కిల్  డెవలప్​మెంట్ లో నాణ్యమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు, ఇంజనీరింగ్  కాలేజీ ఏర్పాటు అవసరం ఉందని సీఎంను ఒప్పించి సాధించామని తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్  కార్పొరేషన్  చైర్మన్  ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్  లక్ష్మణ్  యాదవ్, కాంగ్రెస్  నాయకులు వినోద్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సీజే బెనహర్, మాజీ మున్సిపల్  వైస్  చైర్మన్  షబ్బీర్  అహ్మద్, జీకే ఇంజనీరింగ్  కాలేజీ సెక్రటరీ ఇంతియాజ్ పాల్గొన్నారు.