ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

పాలమూరు, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో మహిళల సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన 103 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. 

 గృహజ్యోతి పథకంతో  ఉచితంగా 200 యూనిట్లు  విద్యుత్ అందిస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు.  పావలా వడ్డీ బకాయిలను చెల్లించామన్నారు.  గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు సిజే బెనహార్, సుధాకర్ రెడ్డి, మాజీ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.