సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జితో ఎంక్వైరీ జరపాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జితో ఎంక్వైరీ జరపాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బేగంబజార్, వెలుగు: టీజీపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అవకతవకలపై సిట్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నిరుద్యోగులు, బాధితులతో కలిసి మంగళవారం టీజీపీఎస్సీ కార్యదర్శి హరితకు ఫిర్యాదు చేశారు. గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1 వ్యవహారంలో హైకోర్టు తీర్పు వచ్చినప్పటికీ నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

డీఎస్పీ శిక్షణ పొందుతున్న వారిలో 35 శాతం మంది శిక్షణ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. 10  నెలల శిక్షణ ఇచ్చినా ఇంతమంది విఫలం కావడానికి కారణాలేమిటో చెప్పాలని కోరారు. టీజీపీఎస్సీ ప్రిలిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేయడంపై కూడా స్పష్టత ఇవ్వాలన్నారు.