కేసీఆర్ కమీషన్లలో కేంద్రానికీ వాటా: జీవన్ రెడ్డి

కేసీఆర్ కమీషన్లలో కేంద్రానికీ వాటా: జీవన్ రెడ్డి
  • అందుకే చర్యలు తీసుకుంటలేరు: జీవన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ కమీషన్లలో కేంద్రానికి కూడా వాటా వెళ్లిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. అందుకే వారి అవినీతిపై బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రధాని, కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రతిసారి కేసీఆర్ అవినీతి, కాళేశ్వరంపై ఆరోపణలు చేశారే తప్ప చర్యలు తీసుకోలేదన్నారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా ఆయన అవినీతిని ప్రోత్సహించిందే బీజేపీ అని ఆయన ఫైర్ అయ్యారు.

గురువారం గాంధీ భవన్ లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనుమతులు లేకుండా, డీపీఆర్ లు ఇవ్వకుండా కేంద్రం, ఫైనాన్సియల్ సంస్థలు అప్పు ఇచ్చాయంటే అక్కడే అర్థం చేసుకోవచ్చన్నారు. సీతక్కకు మంచి శాఖ ఇచ్చి.. డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వలేదని అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి వాటికి ఆటంకాలు తెచ్చిందే కేసీఆర్ అని  ఫైర్​ అయ్యారు. కేసీఆర్ అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే మోదీతో సఖ్యతగా ఉన్నారని, విభజన చట్టంలోని హామీలను పట్టించుకోలేదని మండిపడ్డారు.