కేసీఆర్ హయంలో పౌర హక్కులు కనుమరుగవుతున్నాయి : ఎమ్మెల్సీ జీవన్రెడ్డి

కేసీఆర్ హయంలో పౌర హక్కులు కనుమరుగవుతున్నాయి : ఎమ్మెల్సీ జీవన్రెడ్డి

జగిత్యాల జిల్లా : అర్హత ప్రాతిపదికన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యక్ష దరఖాస్తు విధానం రాజకీయ జోక్యానికి పునాది వంటిదన్నారు. పలు సంక్షేమ పథకాలు పొందాలంటే అర్హులకు ఆన్ లైన్ లో అప్లై చేసుకునే విధానం కల్పించినప్పుడు.. గృహలక్ష్మీ పథకానికి మాత్రం ప్రత్యక్ష విధానం అమలు చేయడంలో ఉన్న ఆంతర్యం ఏంటని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గృహలక్ష్మీ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయంపై లెక్కలు లేవన్నారు. కనీసం దరఖాస్తు చేసుకున్న వారికి రశీదు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్ల మంజూరు ప్రక్రియ కేవలం కాగితాలకే పరిమితి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా కనపడుతోందని ఆరోపించారు. 

గృహలక్ష్మీ పథకానికి కులం, ఆదాయం సర్టిఫికెట్స్ కావాలనే నిబంధన పెట్టడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చెప్పారు. అర్హులపై రాష్ర్ట ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. పదేళ్లలో ఇంటి నిర్మాణ వ్యయం రెట్టింపు అయ్యిందన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.3 లక్షలు సరిపోతాయా..? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే రూ. లక్షలు సరిపోక.. మరో రూ.5 లక్షలు అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోందన్నారు. అన్ని ధరలు పెరిగాయని, ప్రభుత్వం ఇచ్చే రూ.3 లక్షలు సరిపోవని చెప్పారు. ఇసుక, స్టీల్, సిమెంట్ ధరలు మూడింతలు.. సెంట్రింగ్, లేబర్ ఖర్చులు నాలుగింతలు పెరిగాయన్నారు. 

నాలుగేళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పంపిణి చేయలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ ప్రశ్నించారు. వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకే మంజూరు పత్రాలు తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. 2022, 20-23లో రూ.12 వేల కోట్లు కేటాయించినా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు. దేశంలో హౌసింగ్ డిపార్ట్ మెంట్ లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర పౌర హక్కులు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల మంజూరులో ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునే సైట్ కనుమరుగైందన్నారు.