TSPSC చైర్మన్ రాజీనామాను త్వరగా ఆమోదించండి: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి

TSPSC చైర్మన్ రాజీనామాను త్వరగా ఆమోదించండి: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
  • టీఎస్పీఎస్సీ బోర్డు రాజీనామా చేసి నెల అయ్యింది 
  • గవర్నర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

హైదరాబాద్: గవర్నర్ తమిళిసైకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. టీఎస్​పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలంటూ రిక్వెస్ట్​చేశారు. గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల రోజులు గడుస్తున్నా ఆమోదం తెలపలేదని పేర్కొన్నారు. బోర్డు తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చిందన్నారు.  చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని తెలిపారు.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌‌పీఎస్సీ) చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవి నుంచి తప్పుకున్న విషయం మనకు తెలిసిందే.  డిసెంబర్ 12న  టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి తన రాజీనామా లేఖను రాజ్‌‌భవన్‌‌లో అందజేశారు. జనార్దన్‌‌రెడ్డి రాజీనామాను అందుకున్న గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో త్వరగా టీఎస్ పీఎస్సీ చైర్మన్ రాజీనామాను ఆమోదంపై నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి .. గవర్నర్ తమిళిసైకి లేఖ రాశారు