కాళేశ్వరం ప్రాజెక్ట్ బాధ్యులను ఉరి తీయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్ట్ బాధ్యులను ఉరి తీయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్ట్ బాధ్యులను ఉరి తీయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇంజనీర్లు కాకుండా.. లీడర్లు డిజైన్ చేస్తే ఇట్లనే ఉంటదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఇంజనీర్ లు డిజైన్ చెయ్యాలి కానీ.. మాలాంటి నేతలు చేస్తే ఇలాంటి ఫలితమే వస్తుందన్నారు.

దేవదుల ప్రాజెక్టుకు.. ఇంతకు పదింతల వరదలు వచ్చినా ఇప్పటివరకు చెక్కు చెదారలేదని చెప్పారు. జాతీయ స్థాయిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యత లోపంతో.. తెలంగాణ తల దించుకుందని విమర్శించారు. దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని జీవన్ రెడ్డి అన్నారు. 

కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ ఆలోచించి మాట్లాడాలని అన్నారు. కేంద్రాన్ని మేడలు వంచి తెలంగాణ తెచినమని చెప్పి, తెలంగాణ హక్కులను భంగం కలిగించే విధంగా 7 మండలాలను ఆంధ్రలో కలిపారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.

ఫ్రీ బస్ సౌకర్యం వలన ఆటో కార్మికులకు కొంత ఇబ్బంది కలుగుతుందని తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి వారి కోసం తీవ్రంగా ఆలోచన చేస్తున్నారని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సమావేశం నిర్వహించారు.