రూ. 100 కోట్లతో యావర్ రోడ్డును విస్తరిస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

 రూ. 100 కోట్లతో యావర్ రోడ్డును విస్తరిస్తాం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • జగిత్యాల నుంచి ఢిల్లీకి రైల్వే లైన్​ వేయిస్తా
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల రూరల్, వెలుగు : జగిత్యాలలోని యావర్ రోడ్డు విస్తరణకు రూ.100 కోట్లు కేటాయించి, విస్తరిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.  మంగళవారం మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ జ్యోతి నివాసంలో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో 40ఫీట్ల యావర్ రోడ్డును 60 ఫీట్లకు విస్తరించామని గుర్తు చేశారు.

కవిత ఎంపీగా ఉన్నప్పుడు యావర్ రోడ్డును విస్తరించే అవకాశమున్నా పట్టించుకోలేదన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే జగిత్యాల నుంచి మంచిర్యాల మీదుగా ఢిల్లీకి రైల్వే లైను వేయిస్తానని హామీ ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నానని ఎంపీగా ఆశీర్వదించాలని జీవన్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, లీడర్లు గిరి నాగభూషణం, దేశాయి, నందయ్య పాల్గొన్నారు.

ఆలయంలో పూజలు

రాయికల్​, వెలుగు :  రాయికల్ మండలం కట్కాపూర్ వెన్నముద్దల గండి శ్రీ మల్లికార్జున స్వామి గొల్లకేతమ్మ  ఆలయంలో మంగళవారం ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.  రెండు రోజులుగా జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. రాయికల్, బీర్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ మండలాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు.