
కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటపెడతామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నా బీఆర్ఎస్ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
గత ప్రభుత్వ హయాంలో భద్రాచలానికి చెందిన 7 మండలాలు కోల్పోయామన్నారు. ఐటీఐఆర్ తేవడం.. విభజన చట్టం హక్కులను సాధించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కాంగ్రెస్ పై విమర్శలు చేయడం బంద్ చేయండన్నారు.